బిగ్ న్యూస్: భారత్ లో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు…మరో 459 మంది మృతి!

Thursday, April 1st, 2021, 12:31:47 PM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు దేశం లో భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 11,25,681 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 72,330 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,22,21,665 కి చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉండటం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా నమోదు అవుతున్న మరణాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తుండగా, గడిచిన 24 గంటల్లో459 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,62,927 కి చేరింది. నిన్న ఒక్క రోజే 40,382 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య కోటి 14 లక్షలకు పైగా చేరింది. ప్రస్తుతం భారత్ లో 5,84,055 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.