భారత్ లో 80 వేలకు పైగా కేసులు…469 మరణాలు!

Friday, April 2nd, 2021, 11:48:08 AM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత భారత్ లో కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 11,13,966 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 81,466 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,23,03,131 కి చేరింది. అయితే 80 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఈ ఏడాది ఇదే తొలిసారి. రోజురోజుకీ ఈ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 469 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,63,396 కి చేరింది. నిన్న ఒక్క రోజే 50,356 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కోటి పదిహేను లక్షల మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 6,14,696 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.