తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు..!

Wednesday, May 12th, 2021, 09:06:53 PM IST

తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గు ముఖం పడుతున్నాయి. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో కేసుల సంఖ్య కాస్త తక్కువ అనే చెప్పాలి. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 69,525 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,723 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,11,711కి చేరింది.

అయితే కరోనా నుంచి ఇప్పటివరకు 4,49,744 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 59,133 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 5,695 మంది కరోనా నుంచి కోలుకోగా మరో 31 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,834కి చేరింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 1,38,23,741 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 87.89 శాతం ఉండగా, మరణాల రేటు 0.55% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.