భారత్ లో మరో 44,376 కేసులు…481 మరణాలు

Wednesday, November 25th, 2020, 10:58:52 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 11,59,032 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 44,376 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 92,22,217 కి చేరింది. అయితే ఈ మహమ్మారి కి ఇంకా పూర్తి స్థాయిలో వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 481 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,34,699 కి చేరింది. నిన్న ఒక్కరోజే 37,816 మంది కరోనా వైరస్ నుండి కోలుకున్నారు. మొత్తం ఇప్పటి వరకు భారత్ లో కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 86,42,771 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 4,44,746 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిి వ్ గా ఉన్నాయి.