భారత్ లో ఏ మాత్రం తగ్గని కరోనా…మరో 492 మంది మృతి

Friday, November 27th, 2020, 11:33:18 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే ఇంకా వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే గదిచిన 24 గంటల్లో 11,31,204 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 43,082 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 93 లక్షలకు పైగా చేరింది.

అయితే ఈ మహమ్మారి భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 492 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,35,715 కి చేరింది. అయితే భారత్ లో కరోనా వైరస్ రికవరీ రేటు 93.65 శాతంగా ఉండగా, ఐదు లక్షలకు దిగువగా కరోనా వైరస్ క్రియాశీల కేసులు ఉన్నాయి.