బిగ్ న్యూస్: భారత్ లో మరో 45,230 కేసులు…496 మరణాలు

Monday, November 2nd, 2020, 11:00:51 AM IST

భారత్ లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 8,55,800 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 45,230 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 82,29,313 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 496 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 1,22,607 కి చేరింది.

అయితే కరోనా వైరస్ రికవరీ రేటు లో భారత్ రోజురోజుకీ మెరుగ్గా ఉందని చెప్పాలి. భారత్ లో కరోనా వైరస్ రికవరీ రేటు 91.68 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 53,285 మంది కరోనా వైరస్ నుండి కోలుకోగా, ఇప్పటి వరకు 75,44,798 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 5,61,908 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.