భారత్ లో మరో 44,281 కేసులు…512 మరణాలు

Wednesday, November 11th, 2020, 11:21:26 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఇంకా వేలల్లో నమోదు కావడం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో మరో 11,53,294 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 44,281 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 86,36,011 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 512 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,27,571 కి చేరింది.

అయితే నిన్న ఒక్కరోజే 50,326 మంది కరోనా వైరస్ మహమ్మారి నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకు భారత్ లో కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 80,13,783 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 4,94,657 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిి వ్ గా ఉన్నాయి.