బిగ్ న్యూస్: భారత్ లో మరో 46,254 కరోనా కేసులు…514 మరణాలు

Wednesday, November 4th, 2020, 10:20:23 AM IST

భారత్ లో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో మరో 12,09,609 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 46,254 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 83,13,877 కి చేరింది. ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 514 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,23,611 కి చేరింది. ఈ మృతుల సంఖ్య కూడా మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అయితే కరోనా వైరస్ రికవరీ రేటు కాస్త మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 53,357 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. అయితే తాజాగా కోలుకున్న వారి తో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న బాధితుల సంఖ్య 76,56,478 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 5,33,787 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిి వ్ గా ఉన్నాయి.