తెలంగాణలో కొత్తగా 5,186 కరోనా కేసులు.. మరో 38 మంది మృతి..!

Sunday, May 9th, 2021, 01:00:32 AM IST


తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. రోజు రోజుకు రికార్డ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 69,148 కరోనా పరీక్షలు నిర్వహించగా 5,186 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,92,385కి చేరింది.

అయితే కరోనా నుంచి ఇప్పటివరకు 4,21,219 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 68,462 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 7,994 మంది కరోనా నుంచి కోలుకోగా మరో 38 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,704 కి చేరింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 1,35,57,646 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 85.54 శాతం ఉండగా, మరణాల రేటు 0.54% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.