బిగ్ న్యూస్: భారత్ లో మరో 44,879 కేసులు…547 మరణాలు!

Friday, November 13th, 2020, 10:51:49 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. దేశంలో 50 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే కేసుల తీవ్రత తక్కువగా ఉన్నా, మృతుల సంఖ్య 500 కి పైగా నమోదు అవుతూ ఉండటం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 11,39,230 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 44,879 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 87,28,795 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మహమ్మారి భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 547 మంది కరోనా వైరస్ భారిన పడి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,28,668 కి చేరింది. నిన్న ఒక్కరోజే 49,079 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ 81,15,580 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 4,84,547 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.