బిగ్ న్యూస్: భారత్ లో ఏ మాత్రం తగ్గని కరోనా ఉధృతి…మరో 550 మంది మృతి

Thursday, November 12th, 2020, 11:03:27 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. కేసులు తగ్గినట్లు గానే అనిపించినా దేశం లో చలి తీవ్రత మొదలు కావడం తో మళ్ళీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 11,93,358 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 47,905 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 86,83,917 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 550 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 1,28,121 కి చేరింది. ఈ మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అయితే కరోనా వైరస్ రికవరీ రేటు భారత్ లో మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో మరో 52,718 మంది కరోనా వైరస్ నుండి కోలుకోగా, ఇప్పటి వరకు ఈ మహమ్మారి భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 80,66,502 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 4,89,294 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.