భారత్ లో మరో 48,648 కరోనా కేసులు…563 మరణాలు

Friday, October 30th, 2020, 10:22:35 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 11,64,648 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 48,648 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 80,88,851 కి చేరింది. అయితే ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అదే తరహా లో కరోనా వైరస్ మరణాల సంఖ్య కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 563 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే ఈ మరణాల తో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 1,21,090 కి చేరింది.

అయితే కరోనా వైరస్ రికవరీ రేటు భారత్ లో మెరుగ్గా ఉందని చెప్పాలి. ప్రస్తుతం భారత్ లో 90.99 శాతంగా కరోనా వైరస్ రికవరీ ఉంది. గడిచిన 24 గంటల్లో 57,386 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకోగా ఇప్పటి వరకు కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 73,73,375 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 5,94,386 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.