భారత్ లో మరో 47,638 కేసులు…670 మరణాలు

Friday, November 6th, 2020, 11:32:07 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో మరో 12,20,711 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 47,638 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు 84,11,724 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే కరోనా వైరస్ మహమ్మారికి ఇంకా పూర్తి స్థాయిలో వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 670 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే ఈ మరణాల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉండటం దేశ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటి వరకు భారత్ లో 1,24,985 మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలను కోల్పోయారు.

అయితే కరోనా వైరస్ రికవరీ లో భారత్ మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 54,157 మంది కరోనా వైరస్ నుండి కోలుకున్నారు. అయితే మొత్తం ఇప్పటి వరకు కరోనా వైరస్ మహమ్మారి భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 77,65,966 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 5,20,773 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.