భారత్ లో మరో 1,31,968 కేసులు…780 మరణాలు

Friday, April 9th, 2021, 10:57:49 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో చేసిన కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలలో 1,31,968 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కోటి 30 లక్షలకు పైగా చేరింది. అయితే ప్రతి రోజూ భారీగా కేసులు నమోదు కావడం పట్ల ప్రజలు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్ష కి పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం మరింత కలవర పెట్టే అంశం అని చెప్పాలి.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 780 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,67,642 కి చేరింది. అయితే నిన్న ఒక్క రోజే 51,899 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 1,19,13,292 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 9,79,608 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.