ఏపీ లో ఉగ్ర రూపం దాల్చిన కరోనా…24 గంటల్లో 793 కేసులు…11 మరణాలు!

Monday, June 29th, 2020, 02:49:42 PM IST

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. రోజురోజుకీ వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ, తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో 30,216 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయగా, 706 మంది కి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. అయితే ఇతర రాష్ట్రాల, విదేశాల నుండి వచ్చిన మరో 87 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. అయితే కేవలం 24 గంటల్లో ఇన్ని కేసులు నమోదు కావడం పట్ల ప్రజల ఆందోళన చెందుతున్నారు. అయితే తాజాగా నమోదు అయినా ఈ పాజిటివ్ కేసులతో మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 13,891 కి చేరింది.

అయితే కరోనా వైరస్ కారణంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 11 మంది కరోనా కాటు కి బలికగా, ఇప్పటి వరకు ఈ వైరస్ భారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 180 కి చేరింది. నేడు కర్నూల్ లో అయిదుగురు, కృష్ణా లో ఇద్దరు, నెల్లూరు లో ఇద్దరు, విజయ నగరం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు మరణించారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 7,479 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉండగా, మిగతా 6,232 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి కి ఇంకా వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో ఈ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.