తెలంగాణలో మరో 837 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు!

Tuesday, October 27th, 2020, 08:59:55 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది అని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో మరో 837 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ తీవ్ర తగ్గుముఖం పట్టినట్లు అనిపించినా కేసులు మాత్రం నమోదు అవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,32,671 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో నలుగురు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా మరణాల తో తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,315 కి చేరింది. నిన్న ఒక్కరోజే 1,554 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొగా, ఇప్పటి వరకూ 2,13,466 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 17,890 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.