బిగ్ షాక్: ఈటలకు మద్ధతుగా టీఆర్ఎస్ నేతల రాజీనామా..!

Thursday, June 10th, 2021, 08:11:39 PM IST


భూ కబ్జా ఆరోపణల అనంతరం మంత్రి పదవి నుంచి భర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి, తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా ప్రకటించారు. అయితే త్వరలోనే బీజేపీలో చేరబోతున్న ఈటల రాజేందర్ తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌పై పూర్తిస్థాయిలో ఫోకస్ చేస్తూనే ఉప ఎన్నికకు రెడీ అవుతున్నారు. అయితే ఈటలకు చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ పార్టీ కూడా వ్యూహరచనలు మొదలుపెట్టింది. ఈటల వెనకున్న క్యాడర్‌ను నిలదొక్కుకుంటూనే, బీజేపీ నేతలను కూడా పార్టీలోకి చేర్చుకున్నే పనిలో నిమగ్నమయ్యింది.

అయితే తాజాగా టీఆర్ఎస్‌కు ఓ షాక్ తగిలింది. టీఆర్ఎస్ యువజన నేతలు పార్టీకి రాజీనామా చేసి ఈటలకు జై కొట్టారు. ఐదు మండలాల యువజన, విద్యార్థి విభాగం అధ్యక్షులు రాజీనామా చేశారు. నియోజకవర్గంలోని జమ్మికుంట చౌరస్తాకు వచ్చి ఈటలకు మద్ధతుగా నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పనిచేసి, పార్టీకి సేవ చేసిన ఈటలను బహిష్కరించి ఉద్యమంలో పాల్గొనని నేతలను పదవులు ఇవ్వడం సరికాదని వారు మండిపడ్డారు.