బిగ్ న్యూస్: ఇంటికెళ్ళిన పోలీసులపైకి కుక్కలను వదిలిన పీవీపీ..!

Tuesday, June 30th, 2020, 03:01:00 AM IST


వైసీపీ నేత, ప్రముఖ సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ)పై మరో కేసు నమోదు అయ్యింది. ఓ కేసు విచారణ కోసం పలువురు పోలీసులు పీవీపీ ఇంటికి వెళ్లగా వారిపై కుక్కలను వదిలారు. అయితే ఈ ఘటన కారణంగా పీవీపి ఇంటి నుంచి వెనుదిరిగి జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై హరీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. విచారణ కోసం వెళ్తే పీవీపీ తమపై కుక్కలను ఉసిగొల్పారని ఫిర్యాదులో పేర్కొనగా, జూబ్లిహిల్స్ పోలీసులు ఐపీసీ 353 కింద పీవీపీపై కేసు కూడా నమోదు చేశారు.

అయితే ఇటీవల పీవీపీపై ఓ వక్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన ఇంటి నిర్మాణాన్ని పీవీపీ అన్యాయంగా అడ్డుకుంటున్నారని, తన స్థలంలో ఇళ్లు కట్టుకుంటుంటే మనుషులను పెట్టి బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేయగా పోలీసులు పీవీపీపై కేసు నమోదు చేశారు.