కరోనా వైరస్ భారిన పడి మరొక ఎమ్మెల్యే మృతి

Monday, April 19th, 2021, 01:16:15 PM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత దేశం లో రోజురోజుకీ పెరుగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య, మృతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే ఈ మహమ్మారి కి ఏ ఒక్కరూ కూడా అతీతులు కారు. దీని భారిన పడి ఇప్పటికే చాలా మంది ప్రముఖులు తమ ప్రాణాలను కోల్పోయారు. అయితే బీహార్ లో తాజాగా మరొక ఎమ్మెల్యే కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయారు. జేడీయూ సీనియర్ నేత, మాజి విద్యాశాఖ మంత్రి అయిన మేవాలాల్ చౌదరి కరోనా వైరస్ మహమ్మారి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే ఈ విషయాన్ని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే మేవా లాల్ గత వారం కరోనా వైరస్ భారిన పడ్డారు అని, అయితే అప్పటి నుండి కూడా పారాస్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు అని వ్యాఖ్యానించారు. అయితే చికిత్స పొందుతూ ఆసుపత్రి లో తుది శ్వాస విడిచారు అని ఆ పార్టీ నేతలు తెలిపారు.