తమిళనాట మరో ‘అమ్మ’ పథకం

Friday, September 26th, 2014, 12:57:08 PM IST

tamilnadu
తమిళనాడు ప్రజల్ని ముఖ్యమంత్రి జయలలిత ‘పథకం’ ప్రకారం ఆకట్టుకొంటున్నారు. ‘అమ్మ’ పేరుతో పథకాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రూపాయికే ఇడ్లీ, 5 రూపాయలకే సాంబారన్నం, తక్కువ రేటుకే సినిమా, మెడికల్ షాపులు, బియ్యం కూరగాయలు తక్కువ ధరకే అందించే ‘అమ్మ’ పథకంలో మరోకటి చేర్చారు.

తాజాగా అమ్మ సిమెంట్ పేరుతో మరో పథకాన్ని త్వరలోనే తమిళనాడు ప్రభుత్వం తీసుకురానుంది. ఈ పథకం కింద పేద, మధ్య తరగతి కుటుంబాలకు 190 రూపాయలకే బస్తా సిమెంటును సరఫరా చేయనున్నారు. త్వరలోనే తమిళనాడు వ్యాప్తంగా అమ్మ సిమెంట్ దుకాణాలను ప్రారంభించనున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఇల్లు కట్టుకోవాలన్న కల నెరవేర్చేందుకే ఈ పథకం ప్రారంభించనున్నట్టు జయలలిత సర్కార్ తెలిపింది.