అక్టోబర్ 15లోగా రుణాలుమాఫీ

Wednesday, September 24th, 2014, 12:39:32 PM IST


రైతు రుణమాఫీపై పలు సందేహాలు ఉన్న వస్తున్నాయని వాటన్నింటిని త్వరలోనే నివృత్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. 50వేల లోపు రుణాలు తీసుకున్న వారు నలభై శాతం మంది ఉన్నారని ఆయన అన్నారు. తుది జాబితా ఇంకా అందలేదని.. జాబీతా అందగానే రుణాలు మాఫీ చేస్తామని అన్నారు. ఏది ఏమైనా అక్టోబర్ 15లోపు రుణాలు మాఫీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈరోజు ఆయన కర్నూలులో రైతుసంఘం నాయకులతో మాట్లాడారు. రుణాలమాఫికీ ఆధార్ తప్పనిసరీ అని, ఒకవేళ ఆధార్ లేకపోతె.. గుర్తింపు కార్డు ఉన్నా సరిపోతుందని ఆయన అన్నారు.