ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు దూకుడు మాములుగా లేదుగా..!

Friday, July 31st, 2020, 11:10:33 AM IST

ఇటీవలే బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ పార్టీకు అధ్యక్షుని గా సీనియర్ రాజకీయ నాయకుడు సోము వీర్రాజు ఎంపికైన సంగతి అందరికీ తెలిసిందే. మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ను తప్పించి ఆయన్ను నియమించారు. దీనితో ఏపీ బీజేపీ పార్టీలో నూతన ఒరవడి మొదలయ్యింది అని చెప్పాలి. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధమైన పాత్ర ఏపీ రాజకీయాల్లో ఈయన వల్ల బీజేపీ పోషిస్తుంది.

ఇదిలా ఉండగా ఆయన ప్రతీ రోజు మామూలు స్థాయిలో దూకుడు ప్రదర్శించడం లేదు. ముఖ్యంగా గత ఎన్నికల్లో వారి కో పార్టీ జనసేనను దెబ్బ కొట్టినందుకు రివెంజ్ తీసుకుంటున్నామా అన్నట్టుగా చంద్రబాబుపై కామెంట్స్ చేస్తున్నారు. మూడు రాజధానులు విషయంలో కానీ చేస్తున్న విమర్శలకు చంద్రబాబు అండ్ టీం కు మరో మాట రానట్టు అయ్యిపోతుంది. మొత్తానికి మాత్రం ఈయన దూకుడు వీరి రెండు పార్టీలకు మంచి చేసే విధంగానే ఉందని చెప్పాలి.