చంద్రబాబు సతీమణికి గాయం!

Monday, May 25th, 2015, 12:03:02 PM IST

bhuvaneshwari
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి నేడు గాయమైంది. కాగా ట్రెడ్ మిల్ పై ఎక్సర్ సైజ్ చేస్తుండగా ఆమె కింద జారిపడ్డారని సమాచారం. ఇక ఈ ప్రమాదంలో ఆమె చేతి మణికట్టుకు గాయమైనట్లు తెలుస్తోంది. అయితే వెంటనే స్పందించిన ఇంట్లోవారు ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ మధ్యాహ్నం ఆమెను అపోలోలో వైద్యులు శస్త్ర చికిత్స చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భువనేశ్వరిని కలిసేందుకు అపోలో ఆసుపత్రికి వెళ్ళినట్లు సమాచారం.