అమెరికాలో హద్దులు దాటినా అభిమానం..వారేవా ఏమి క్రేజ్

Saturday, August 17th, 2019, 10:47:09 AM IST

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇంట బయట విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మొన్నటి ఎన్నికల్లో అఖండమెజారిటీ సొంతం చేసుకొని సీఎం అయిన తర్వాత అతను తీసుకున్న కొన్ని నిర్ణయాల వలన మంచి మాస్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. యంగ్ అండ్ డైనమిక్ సీఎం అనే పేరు జగన్ కి సరిపోతుందని చాలా మంది చెపుతున్నారు. ప్రస్తుతం ఏపీ సీఎంకి ఉన్న క్రేజ్ గురించి మాట్లల్లో చెప్పలేము, తాజాగా అమెరికా పర్యటనికి జగన్ కి కళ్ళు చెదిరిపోరే రీతిలో వెల్కమ్ చెప్పారు.

ఈ సందర్భంగా వాషింగ్టన్ లో చిన్న స్థాయి సమావేశం జరిగినట్లు తెలుస్తుంది. ఇందులో సప్లై చేసిన వాటర్ బాటిల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. “YSRCP USA” అనే లోగోతో జగన్ ఫోటోలు ముద్రించిన స్పెషల్ వాటర్ బాటిల్స్ సరఫరా చేసారు . 355ml పరిమాణంలో కొన్ని వేల వాటర్ బాటిల్స్ జగన్ పర్యటన సందర్భంగా తయారు చేపించినట్లు తెలుస్తుంది. ఏదో ఆంధ్రాలో అయితే ఆ స్థాయి అభిమానం ఉండటం సహజం, కానీ అమెరికా ఇంతలా వీరాభిమానులు ఉండటం మాములు విషయం కాదు.

అమెరికాకి జగన్ తన చిన్న కూతురిని యూనివర్సిటీలో చేర్పించటమే ముఖ్య ఉద్దేశ్యంతో వెళ్ళాడు. ఇక పనిలో పనిగా తనయొక్క పర్సనల్ వ్యవహారాలు, అలాగే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పెట్టుబడుల సమావేశాల్లో కూడా పాల్గొనటం, ప్రవాసాంధ్రులతో ముఖాముఖీ సమావేశాల అనంతరం వారం రోజులు తర్వాత ఇండియా రానున్నాడు. ఈ పర్యాటనికి సంబంధించి ఖర్చులు మొత్తం జగన్ సొంత నిధులే పెట్టుకుంటున్నాడు. కేవలం భద్రత పరమైన విషయంలో మాత్రం ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.