ఏపీలో యాంటీ ర్యాగింగ్ పాలసీ!

Friday, August 14th, 2015, 09:48:41 PM IST


గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్ధిని రిషితేశ్వరి ఆత్మహత్య ఆంధ్రప్రదేశ్ లో ఎంత కలకలం రేపుతోందో తెలిసిందే. కాగా ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న రిషితేశ్వరి ర్యాగింగ్ భూతానికి అన్యాయంగా బలైపోయింది. ఇక రిషితేశ్వరి ఆత్మహత్య అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ర్యాగింగ్ పై ఉక్కుపాదాన్ని మోపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో యాంటీ ర్యాగింగ్ పాలసీని ప్రకటించింది.

అలాగే బయోమెట్రిక్ విధానంలో విద్యార్ధుల హాజరును నమోదు చెయ్యాలని, హాజరు ఆధారంగా ఫీజు రియంబర్స్ మెంట్ చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా కాలేజీ క్యాంపస్ లలోకి ఇతరులను అనుమతించరాదని ప్రభుత్వం ఆదేశించింది. ఇక యూనివర్సిటీ, కాలేజీ ప్రాంగణాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చెయ్యాలని ఆదేశించిన ప్రభుత్వం ఈ నెల 31వ తేదీలోపు నిబంధనలను అమలు పరచాలని హెచ్చరించింది.