ఆంధ్ర ప్రదేశ్ లో నేడు, రేపు వాక్సినేషన్ నిలిపివేత…కారణం ఇదే!

Monday, May 10th, 2021, 02:00:37 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ ను అరికట్టడం లో వాక్సిన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వాక్సినేషన్ ప్రక్రియ నిలిచి పోయింది. నేడు, రేపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇక వాక్సినేషన్ ప్రక్రియ నిలిచింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో టీకా కార్యక్రమానికి పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అయితే టీకా కేంద్రాల వద్ద రద్దీ, తోపులాటలతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాన్ని మార్చివేయడం జరిగింది. అయితే ఓటర్ స్లిప్పుల తరహాలో వాక్సిన్ స్లిప్పులు పంపిణీ చేయనున్నారు. అయితే ఎవరికి ఏ టైం కి వాక్సిన్ వేసే సమాచారం తో స్లిప్పులు ఇళ్లకే పంపిణీ చేయనున్నారు అధికారులు.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 3.5 లక్షల డోసులు అందుబాటు లో ఉండగా, రెండవ డోస్ వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మరొక వైపు కోవిన్ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ మార్పుల పై అధికారులు కసరత్తులు చేస్తున్నారు. వాక్సిన్ పంపిణీ వద్ద రద్దీ తగ్గించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే కరోనా వైరస్ టీకాలు తగినంత లేకపోవడం తోనే ఈ ప్రక్రియ ఆపివేసినట్లు చెబుతున్నారు అధికారులు. అయితే ఈ విషయం తెలియక అధికారుల పై ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.