ఏపీ లో 8 వ తేదీన సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

Tuesday, April 6th, 2021, 07:45:10 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికలు, మునిసిపల్ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే పరిషత్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమాయత్తం అవుతున్నారు. అయితే పరిషత్ ఎన్నికల విధులకు ప్రభుత్వం వాహనాలను వినియోగించుకోవచ్చు అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాక వాహనాలను వినియోగించుకొనే విధంగా జిల్లా కలెక్టర్ లకు అందుబాటులో ఉంచాలని ఆదేశాలను ఇచ్చింది. అయితే 8 వ తేదీన ఓటు హక్కు వినియోగించుకోనే విధంగా సెలవు దినంగా ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే పోలింగ్ జరిగే చోట్ల షాపులు, కార్యాలయాలకు, వ్యాపారాలకు 8 వ తేదీన సెలవు దినంగా ప్రకటించడం జరిగింది. అయితే పోలింగ్ వీధుల్లో ఉండే సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పార్టీ కి కూడా మద్దతు గా పని చేయకూడదు అని ఆదేశాలను జారీ చేసింది.