నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉత్తర్వులను నిలిపివేసిన హైకోర్టు

Wednesday, March 3rd, 2021, 01:02:35 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మునిసిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే పలు చోట్ల మళ్ళీ నామినేషన్ల కి అనుమతి కల్పిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.అయితే గతేడాది మార్చి లో బలవంతపు ఉపసంహరణ లు జరిగాయి అని పలు పార్టీ లు ఫిర్యాదు చేయడం తో రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదిక మేరకు నామినేషన్ లను వేసేందుకు అనుమతులు ఇవ్వడం జరిగింది.

అయితే నిన్న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా నామినేషన్ లను స్వీకరించారు. గురువారం మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉప సంహరణ కి అవకాశం కల్పించారు. అయితే ఎన్నికల కమిషనర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పలువురు హైకోర్టు ను ఆశ్రయించారు. పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.అంతేకాక వాలంటీర్ల పై నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలను కూడా నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే దీని పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి.