అదనంగా వాక్సిన్ తెప్పించడం లో చంద్రబాబు ఎటువంటి ప్రయత్నం చేయడం లేదు – ఆళ్ళ నాని

Wednesday, May 12th, 2021, 05:34:21 PM IST

Alla-Nani

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఒక పక్క కరోనా కట్టడి లో ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే, ప్రతి పక్ష పార్టీ నేతలు మాత్రం అధికార పార్టీ వైసీపీ ను ఎండగడుతూ వరుస విమర్శలు చేస్తున్నారు. ఆక్సిజన్ కొరత విషయం నుండి, వాక్సిన్ ల విషయం వరకూ అన్ని విషయాల్లో వైసీపీ పాలన విధానం పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ మేరకు వైసీపీ నేతలు సైతం టీడీపీ తీరును ఎండగడుతూ వరుస విమర్శలు చేస్తున్నారు.

ఈ మేరకు తెలుగు దేశం పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మంత్రి ఆళ్ళ నాని వరుస విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రజలను భయాందోళనలకు గురి చేసే విధంగా మాట్లాడుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే వాక్సిన్ విషయం లో వాస్తవాలు తెలిసి కూడా రాజకీయాలు చేస్తున్నారు అంటూ విమర్శించారు. అయితే చంద్రబాబు కి, భారత్ బయోటెక్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని,అయినా అదనంగా వాక్సిన్ తెప్పించడం లో ఎటువంటి ప్రయత్నం చేయడం లేదు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే మంత్రి ఆళ్ళ నాని చేసిన వ్యాఖ్యలు సర్వత్రా హాట్ టాపిక్ గా మారాయి.