తప్పుడు రిపోర్ట్ ఇస్తే లైసెన్స్ రద్దు చేయడానికి వెనకాడం – ఆళ్ళ నాని!

Wednesday, July 8th, 2020, 02:59:49 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ మహమ్మారి వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న వారితో మంత్రి ఆళ్ళ నాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అయితే ఆసుపత్రిలో ఆహారం, వైద్య సదుపాయాలు, పారిశుధ్యం, నీరు వంటి అంశాల పై బాధితుల నుండి విషయాలను అడిగి తెలుసుకున్నారు. అయితే వైదులు తమకు మంచి సేవను అందిస్తున్నారు అని, నాణ్యత కలిగిన పౌష్టిక ఆహారం అందిస్తున్నారు అని బాధితులు తెలిపారు. అంతేకాక పరిసర ప్రాంతాల ను సైతం శుభ్రంగా ఉంచడం మాత్రమే కాక, సానిటైజ్ కూడా నిర్వహిస్తున్నారు అని ఆళ్ళ నాని కి తెలిపారు.

అయితే ఆళ్ళ నాని ఈ మేరకు వైద్యులకు పలు హెచ్చరికలు జారీ చేశారు. టెస్టుల సంఖ్య పెంచడం తో ఫలితాల్లో చాలా ఆలస్యంగా జరుగుతుంది అని అన్నారు. అంతేకాక బాధితులకు అందిస్తున్న ఆహార విషయం లో ఏదైనా అవినీతి జరిగితే గుత్తే దారులను వెంటనే తొలగిస్తాం అని వ్యాఖ్యానించారు. కొన్ని ప్రైవేట్ ల్యాబ్ లలో తప్పుడు రిపోర్టులు వచ్చిన సంగతి తెలిసిందే. మరొకసారి తప్పుడు రిపోర్ట్ ఇస్తే లైసెన్స్ రద్దు చేయడానికి కూడా వెనాకడం అని హెచ్చరించారు. అయితే ఈ నేపధ్యంలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలి అని వైద్యులకు ఆళ్ళ నాని సూచించారు.