చినబాబు ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి వెళ్తుంది…రఘురామ టీడీపీ ఏజెంట్ గా మారారు – మంత్రి అనిల్

Thursday, June 10th, 2021, 05:40:44 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం లో మాట్లాడుతూ ప్రతి పక్ష పార్టీ టీడీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై సైతం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు టీడీపీ ఏజెంట్ గా మారారు అంటూ మంత్రి అనిల్ కుమార్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు విషయం లో టీడీపీ చేసిన తప్పులను తాము చేయము అంటూ చెప్పుకొచ్చారు. పోలవరం ను టీడీపీ అడ్డుకోవాలని చూస్తోంది అంటూ చెప్పుకొచ్చారు. రైతుల కళ్ళల్లో ఆనందాన్ని టీడీపీ చూడలేక పోతుంది అంటూ విమర్శించారు. పోలవరం పూర్తి అయితే జగన్ కి, వైఎస్సార్ కి మంచి పేరు వస్తుంది అని వారి భయం అంటూ చెప్పుకొచ్చారు. అందుకే రఘురామ కృష్ణంరాజు లాంటి వాళ్ళతో అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ మేరకు తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

చినబాబు ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి వెళ్తుంది అంటూ చెప్పుకొచ్చారు. మూడు శాఖలకు మంత్రిగా చేసినా, ఎమ్మెల్యే గా గెలవలేక పోయాడు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఉన్న ఎమ్మెల్సీ కూడా ఒక ఏడాది లో పూర్తి అవుతుంది అని చెప్పుకొచ్చారు. అందుకే బయట తిరగలేక జూమ్ లో కూర్చొని సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చారు. జగన్ అమూల్ బేబీ అయితే, నువ్వు హెరిటేజ్ దున్నపోతువా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాటలు నీకే కాదు, మాకు వచ్చు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.