రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు – మంత్రి కన్నబాబు

Friday, May 7th, 2021, 07:32:03 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి పాజిటివ్ కేసులు మరియు మరణాల పెరుగుదల తో రాష్ట్ర ప్రభుత్వం పగటి పూట కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మేరకు మంత్రి కన్నబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్, కర్ఫ్యూ దృష్ట్యా రైతులు మరియు వినియోగ దారుల పై ఎలాంటి దుష్ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటున్నాం అని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. అయితే రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించిన విషయాన్ని వెల్లడించారు.

అయితే వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విత్తనాల సరఫరా కు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత వలన రైతుల ఉత్పత్తుల ధరలు పడిపోకుండా చూడాలి అంటూ చెప్పుకొచ్చారు. అయితే నిత్యావసర వస్తువుల రవాణా కు కూడా తగిన అనుమతులు కల్పించాలి అంటూ చెప్పుకొచ్చారు. రైతులకు అవసరం అయిన ఎరువులు, రసాయనాల దుకాణాలు కూడా సాయంత్రం వరకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలి అంటూ ఆదేశించారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ తీవ్రత కారణంగా కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.