రోజాకు మరోమారు నోటీసులా.. ఎవరిచ్చారబ్బా..?

Saturday, April 2nd, 2016, 07:25:01 PM IST


వైకాపా నాయకురాలు రోజాను ఆంధ్రప్రదేశ్ శాసన సభ నుంచి సంవత్సరం పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. శాసనసభ సస్పెండ్ తీర్మానానికి వ్యతిరేకంగా రోజా హైకోర్ట్ కు వెళ్లారు. అయితే సింగిల్ బెంచ్ రోజాకు అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ.. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అప్పీల్ లు వెళ్ళింది. అప్పీల్ లో ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో.. రోజా ఇప్పుడు సుప్రీం కోర్ట్ మెట్లెక్కారు.

ఇక ఇదిలా ఉంటే, శాసనసభా హక్కుల సంఘం రోజాకు నోటీసులు జారీ చేసింది. గౌరవ శాసన సభా సభ్యురాలిగా ఉన్న రోజా సభలో ప్రవర్తించిన తీరు సరిగా లేదని చెప్పి ఆమెకు గతంలో కూడా శాసన సభా హక్కుల సంఘం నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు మరోమారు నోటీసులు అందజేసింది. ఈనెల ఆరో తేదీన కమిటి ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నది.

వీడియో కోసం క్లిక్ చేయండి