సిగరెట్లు, మందు ఏపీ సత్తా ఏమిటో నిరూపించాయి..!

Thursday, July 7th, 2016, 03:49:24 PM IST


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఓ అరుదైన ఘనతను సాధించింది. జూన్ 2016 త్రైమాసిక సంవత్సరానికి గాను కమర్షియల్ ట్యాక్స్ రూపంలో 8,250 కోట్ల రూపాయల రెవెన్యూని సంపాదించి రికార్డ్ సృష్టించింది. అనగా క్రితం సారికంటే ఈసారి 23.6 % వృద్ధిని సాధించింది. ఈ మొత్తం పెరుగుదలకు సిగరెట్లు, లిక్కర్ పై పెంచబడిన అధిక ధరల వలనే సాధ్యమైంది.

ఈ త్రైమాసికంలో సిగరెట్లపై రూ. 173 కోట్లు, లిక్కర్ పై రూ. 2,040 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. ఈ ఘనత దేశంలోని మరే రాష్ట్రానికీ దక్కలేదు. రాష్ట్రం విడిపోయాక హైదరాబాద్ ప్రమేయం లేకుండా కేవలం విజయవాడ, విశాఖపట్టణం, కర్నూల్, కాకినాడ వంటి ప్రధాన నగరాల ఆధారంగా ఇంతటి ఆదాయం రావడంతో ఏపీ పెట్టుబడులకు ఎంత అనుకూలమో తెలుస్తోంది. ఈ లెక్కలు చూసిన అనలిస్టులు ఒక్క సిగరెట్లు, లిక్కర్ వంటి వాటి వల్లే ఇంతటి ఆదాయం ఉంటే ఇతర ప్రధాన పరిశ్రమలు, రంగాల ద్వారా ఎంత ఆదాయం వస్తుందో అని లెక్కలేసుకుంటున్నారు.