సచివాలయ శంఖుస్థాపనకు అన్ని ఏర్పాట్లు పూర్తి

Tuesday, February 16th, 2016, 04:22:48 PM IST


విజయవాడలో ఏర్పాటు చేయనున్న తాత్కాలిక సచివాలయ శంఖుస్థాపన ముహూర్తం దగ్గరపడింది. రేపే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంఖుస్థాపన రాయిని ప్రతిష్టించనున్నారు. ఈ సచివాలయం గుంటూరు జిల్లా వెలగపూడి గ్రామంలో ఉండబోతోందని మంత్రి నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రులు విజయవాడలో, అధికారులు హైదరాబాదులో ఉండి పనిచేస్తుంటే పాలన సరిగా సాగటం లేదని, పైగా అంతా కలగాపులగంగా ఉందని ఆయన అన్నారు.

ఈ సచివాలయ నిర్మాణాన్ని వచ్చే నాలుగు నెలల్లోగా పూర్తి చెయ్యాలని అనుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే రెండు పెద్ద నిర్మాణ సంస్థలు నిర్మాణ భాద్యతలను చేపట్టడానికి ముందుకొచ్చాయని, మునుపు నిర్ణయించిన చదరపు గజానికి రూ.3000 ధరను రూ.3350 గ మారుస్తున్నట్లు కూడా తెలిపారు.