అంతా ఆపిల్ మానియా..!

Monday, February 2nd, 2015, 11:45:25 PM IST


ఆపిల్ కంపెనీ ఐఫోన్స్ సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతాకాదు. ఆపిల్ కంపెనీ ఐఫోన్స్ విక్రయంలో సరికొత్త అధ్యయనాన్ని సృష్టించింది. 2014 డిసెంబర్ నెల చివరి వరకు అంటే మూడో త్రైమాసికంలో ఐఫోన్స్ విక్రయాల ద్వారా వచ్చిన మొత్తాన్ని, లాభాలను ఆపిల్ కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. పెద్ద తెర, అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తెస్తూ.. ఐఫోన్ 6 మరియు ఐఫోన్ 6 ప్లస్ విపణిలోకి తెచ్చిన వెంటనే.. విపరీతంగా అమ్మకాలు జరిగాయి. ఇంకా చెప్పాలంటే, ఈ లేటెస్ట్ ఐఫోన్స్ అమ్మకాలలో అధికభాగం అమ్మకాలు చైనాలో జరిగాయి. ఐఫోన్ 6 మరియు 6 ప్లస్ లు మొబైల్ విజయం సాధించడానికి చైనాలో జరిగిన అమ్మకాలే కారణమని ఆపిల్ కంపెనీ ప్రకటించిన విషయం విదితమే.

ఇక, మూడో త్రైమాసికంలో ఆపిల్ కంపెనీకి వచ్చిన లాభం…. 2013-14లో భారత సంస్థ ఓఎన్జీసి సాధించిన లాభాల కేట్ మూడు రెట్లు ఎక్కువ. నిఫ్టీలో లిస్ట్ అయిన 50 కంపెనీలు సాధించిన లాభాలు అన్ని కలుపుకున్నా… ఆపిల్ కంపెనీ ఒక్క మూడో త్రైమాసికంలో సాధించిన లాభాలకంటే 50% తక్కువ. ఇలా చెప్పుకుంటూ పొతే.. ఆపిల్ కంపెనీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదని చెప్పవచ్చు. భవిష్యత్తులో కూడా ఆపిల్ ఇదే రకమైన వృద్దిని సాధిస్తే ఆపిల్ కు తిరుగుండదు.