ఆప్ ‘విజన్’ డాక్యుమెంట్

Wednesday, November 12th, 2014, 06:52:02 PM IST

ఢిల్లీ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలలో గెలవడం కోసం పార్టీలు ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. గతంలో అధికారంలోకి వచ్చి… తోదరపడి.. రాజీనామా చేసిన ఆప్ పార్టీ అధినేత..అరవింద్ కేజ్రీవాల్.. రేపు జరిగే ఎన్నికలలో ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని… చూస్తున్నది.

ఇందుకోసం… ఆప్ పార్టీ ఢిల్లీ డైలాగ్ పేరుతో ఒక డాక్యుమెంట్ ను విడుదల చేసింది. అంతేకాకుండా ఢిల్లీ డైలాగ్.ఇన్ పేరుతో వెబ్ సైట్ ను కూడా రూపొందించింది. నగర ప్రజల జీవితాలు బాగుపడటానికి అవసరమైన 12 ప్రధానాంశాలతో కూడిన డాక్యుమెంట్ ను ఆప్ పార్టీ రూపొందించింది. తమ పార్టీ ఆలోచనలను ప్రజలతో పంచుకునేందుకు ఈ డాక్యుమెంట్ ను తయారు చేసినట్టు పార్టీ తెలియజేసింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి