మీరు ఎప్పటికీ నా ఫస్ట్ లవ్ పవన్ కళ్యాణ్ – అషూ రెడ్డి

Tuesday, March 2nd, 2021, 01:42:29 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సినీ పరిశ్రమ లో కూడా అభిమానులు భారీ గానే ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కి అటు క్లాస్, ఇటు మాస్ ఫాలోయింగ్ బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా ఫలితం తో సంబంధం లేకుండా పవన్ ను ఆదరించే వారు చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ ఫేం, నటి అశూ రెడ్డి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ కి తాను వీరాభిమాని అని చాలా సార్లు చెప్పుకొచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ సెట్స్ లో ఉండగా అషు కి పవన్ కళ్యాణ్ ను కలిసే అవకాశం వచ్చింది. అయితే పవన్ తో దిగిన ఫోటో ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు.

నా దేవుడి ను మళ్ళీ కలుసుకున్నాను అని, ఆయన నాతో పాటు నేను వేసుకున్న టాటూ కూడా గుర్తుంది అని చెప్పారు, దాదాపు రెండు గంటలు మాట్లాడుకున్నాం, ఎంతో సంతోషంగా అనిపించింది, తిరిగి వెళ్ళేటపుడు ఒక స్వీట్ లెటర్ కూడా ఇచ్చారు, మీరు ఎప్పటికీ నా ఫస్ట్ లవ్ పవన్ కళ్యాణ్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు క్రిష్ కి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఆ లెటర్ లో మీరు కోరుకున్నవన్నీ మీ జీవితం లో జరగాలని కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ అందులో పేర్కొన్నారు. ఆ లెటర్ ను సైతం పోస్ట్ చేశారు ఆశూ రెడ్డి.అయితే ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే పవన్ కళ్యాణ్ కి నాలుగో భార్య గా అవకాశం వస్తే ఒప్పుకుంటారా అని ఒక నెటిజన్ అడగగా, అందుకు యస్ అంటూ చెప్పుకొచ్చారు అషూ రెడ్డి.