సీఎం జగన్ వెంటనే రాజీనామా చేయాలి.. అచ్చెన్నాయుడు డిమాండ్..!

Saturday, May 8th, 2021, 07:13:43 PM IST


ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేడు మీడియాతో మాట్లాడిన అచ్చెన్న కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని అన్నారు. చీము, నెత్తురుంటే జగన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చదువురాని వ్యక్తి సీఎంగా ఉన్నా ప్రజలు రాష్ట్రాన్ని కాపాడేవారని, పక్క రాష్ట్రాలను చూసైనా జగన్ నేర్చుకోవాలని హితవు పలికారు.

అయితే కరోనా టీకా, ఆక్సిజన్ కొరతపై ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని, రాష్ట్రంలో పూర్తి లాక్‌డౌన్ పెడితే ప్రజల ప్రాణాలు నిలుస్తాయని అచ్చెన్న అన్నారు. కేసుల భయంతోనే ప్రధాని మోదీని సీఎం పొగుడుతున్నారని, కేసులు పెట్టాల్సింది చంద్రబాబుపై కాదని ప్రజల చావుకు కారణమవుతున్న సీఎం జగన్‌పై కేసులు పెట్టాలని అచ్చెన్నాయుడు అన్నారు.