వైసీపీ అరాచ‌కాలతో ప్ర‌జాస్వామ్యం ఖూనీ అయ్యింది.. అచ్చెన్నాయుడు సీరియస్ కామెంట్స్..!

Sunday, April 18th, 2021, 01:00:42 AM IST

తిరుప‌తి ఉప ఎన్నిక‌లో వైసీపీ అరాచ‌కాలతో ప్ర‌జాస్వామ్యం ఖూనీ అయ్యిందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్ర‌తీ ఎన్నిక‌ల్లోనూ పోలీసుల్ని వాడుకుని, అధికార ‌యంత్రాంగం సాయంతో దొంగ ఓట్లు వేస్తూ ఇలాగే గెలుస్తున్నార‌ని మ‌రోసారి స్ప‌ష్టం అయ్యిందని ఆరోపించారు. ఒక ఆర్థిక ఉగ్ర‌వాదికి అధికారం అందితే రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌న్నింటినీ ఎలా హ‌త్య‌చేస్తారో జ‌గ‌న్ రెడ్డి ప్ర‌త్య‌క్షంగా చేసి చూపిస్తున్నాడని విమర్శలు గుప్పించారు.

అయితే ఏపీలో జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో జ‌రిగేవి ఎన్నిక‌లు కానేకావని, అవ‌న్నీ బ‌ల‌వంత‌పు ఎంపిక‌లని వైసీపీ అక్ర‌మాలపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్పందించాలి. ఎన్నిక ర‌ద్దు చేయాలి. కేంద్ర‌బ‌ల‌గాలు, కేంద్ర అధికార‌యంత్రాంగంతో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎల‌క్ష‌న్ నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేస్తున్నట్టు అచ్చెన్నాయుడు ప్రకటించారు.