వీర్య దాతను వెతికి పట్టుకుని మరీ వివాహమాడింది

Sunday, March 27th, 2016, 06:34:15 PM IST


అమిన్హా హార్ట్ అనే ఆస్ట్రేలియన్ మహిళ తనకు పుట్టిన ఇద్దరు బిడ్డలు జన్యు లోపం కారణంగా వరుసగా చనిపోతే తనకు వీర్య దాతలు కావాలని ప్రకటన ఇచ్చింది. దాంతో కొందరు వీర్య దానానికి ముందుకొచ్చారు. వారిలో స్కాట్ ఆండర్సన్ అనే 45 ఏళ్ల రైతును ఎంచుకుని అతని వీర్య దానంతో బిడ్డను కంది. వీర్య దానం తరువాత స్కాట్ తన సొంత ప్రాంతానికి వెళ్ళిపోయాడు.

కానీ అమిన్హా మాత్రం తనకు స్కాట్ ద్వారా పుట్టిన బిడ్డ అచ్చు అతనిలాగే ఉండటంతో అతనిపై ప్రేమను పెంచుకుని అతన్ని ఎలాగైనా కలవాలని ప్రయత్నించింది. చివరికి చాలా కాలానికి అనేక వ్యయ ప్రయాసలు పడి ఎలాగో కలుసుకుని తన ప్రేమను చెప్పింది. తన ద్వారా పుట్టిన బిడ్డ అచ్చు తనలానే ఉండటం, అమిన్హా తనను అమితంగా ప్రేమించడంతో స్కాట్ కూడా ఆమె ప్రేమను కాదనలేక ఆమెను వివాహమాడాడు. మొత్తానికి అమిన్హా తనకు వీర్య దానం చేసిన వ్యక్తినే వెతిపట్టుకుని మరీ వివాహమాడింది. త్వరలోనే ఈమె జీవితానని సినిమాగా తీసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.