వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్విట్టర్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 16 నెలలు చిప్పకూడు తిన్నా జగన్‌కి, విజయసాయి రెడ్డికి బుద్ధి మారలేదని, అదే దొంగ బతుకు ఇంకెన్నాళ్లు అని, ఇంకెంత కాలం మీ ఫేక్ ప్రచారం? అందుకే మిమ్మల్ని ఫేక్ గాళ్ళు అనేది అని అన్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి టౌన్లో పాలేశ్వరస్వామి ఆలయం దగ్గర ఉన్న 3 రోడ్ల జంక్షన్ వెడల్పు టీడీపీ హయాంలో జరిగిందని అక్కడ విగ్రహం ఏర్పాటు చేయడానికి దిమ్మ కూడా అప్పుడే ఏర్పాటు చేసారని అయ్యన్నపాత్రుడు చెప్పుకొచ్చారు. పాలేశ్వరస్వామి దేవాలయం ధర్మకర్తలు చెట్టు దగ్గర ఉన్న పాత నంది విగ్రహాన్ని దిమ్మపై ప్రతిష్టించారని, నంది విగ్రహాన్ని తొలగించి వైఎస్ విగ్రహం పెట్టడానికి అసత్య ప్రచారం మొదలుపెట్టారని అన్నారు.
అయితే గ్రామస్తుల సమక్షంలో అందరూ చూస్తుండగానే విగ్రహ ప్రతిష్ఠ జరిగితే సీసీ టీవీ ఫుటేజ్ అంటూ ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? జరిగింది విగ్రహ ప్రతిష్ఠ అయితే టీడీపీ నేతలు విగ్రహం ధ్వంసం చేసారంటూ ఫేక్ ప్రచారం ఏంటి సాయిరెడ్డి అని ప్రశ్నించారు. హిందూ దేవతా విగ్రహాలు ధ్వంసం చేసానంటూ ప్రకటించిన వాడిని, వాడి వెనుక ఉన్న మత మార్పిడి మాఫియా పెద్దలను తప్పించిండానికి మీరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ధర్మమే గెలుస్తుందని, తప్పు చేసిన వారిని ఆ దేవుడు శిక్షిస్తాడు అన్న విషయం జగన్ రెడ్డికి బాగా తెలుసు కదా అని అయ్యన్న చెప్పుకొచ్చారు.
16 నెలలు చిప్పకూడు తిన్నా @ysjagan కి,@VSReddy_MP కి బుద్ధి మారలేదు.అదే దొంగ బతుకు ఇంకెన్నాళ్లు?ఇంకెంత కాలం మీ ఫేక్ ప్రచారం?అందుకే మిమ్మల్ని ఫేక్ గాళ్ళు అనేది.శ్రీకాకుళం జిల్లా,సంతబొమ్మాళి టౌన్ లో పాలేశ్వరస్వామి ఆలయం దగ్గర ఉన్న 3 రోడ్ల జంక్షన్ వెడల్పు టిడిపి హయాంలో జరిగింది.(1/4)
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) January 20, 2021