బాబుకు తలనొప్పిగా మారుతున్న భూసేకరణ బిల్లు రగడ..!

Thursday, February 26th, 2015, 03:05:48 PM IST


కేంద్ర ప్రభుత్వం హడావుడిగా భూసేకరణపై ఆర్డినెన్స్ తెచ్చిన విషయం తెలిసిందే. ఆర్డినెన్స్ తేవడమే కాకుండా, దానిపై బిల్లును తయారు చేసి, పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. అయితే, ఈ బిల్లును ప్రతిపక్షాలు అన్ని వ్యతిరేకిస్తున్నాయి. ప్రతిపక్షాలతో పాటు ఎన్డీఏలోని భాగస్వామ్య పక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి.

ఇక, ఇప్పటికే భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా, దేశ రాజధాని నగరంలో అన్నా హజారే దీక్షకు దిగిన విషయం తెలిసిందే. కాగా, హజారేకు ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలకడంతో…భూసేకరణ బిల్లులో సవరణలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. రైతులకు ఎటువంటి అన్యాయం జరగనివ్వమని కేంద్రం స్పష్టం చేసింది.

అయితే, భూసేకరణ బిల్లుకు వ్యరిరేకంగా నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో రైతులు పెద్ద ఎత్తున రగడ చేస్తున్నారు. అన్నా హజారేకు మద్దతుగా రైతులు సైతం దీక్షచేస్తున్నారు. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా మారింది. రాజధాని నిర్మాణం కోసం రైతుల వద్ద నుంచి ప్రభుత్వం ల్యాండ్ పోలింగ్ పద్దతిలే ఇప్పటికే 24,000 ఎకరాలు సేకరించింది. మరో 13,000 ఎకరాలను త్వరలోనే సేకరించనున్నది. ఇక 45,625 ఎకరాల ల్యాండ్ పోలింగ్ భూమిని ప్రభుత్వం గుర్తించింది. అందులో ప్రభుత్వం 8,001 ఎకరం ప్రభుత్వం అవసరాలకు ఉంచుకొని, మిగిలిన దానిలో రాజధానిని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది.
అయితే, తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే…ల్యాండ్ పోలింగ్ కు, అలాగే భూసేకరణను రైతులు పెద్ద ఎత్తున వ్యతిరేకత తెలుపుతున్నట్టు తెలుస్తున్నది.