బాగ్దాద్ లో నరమేధం.. 172 మంది మృతి

Monday, July 4th, 2016, 02:47:28 PM IST


ఉగ్రవాదులు ఘాతుకాలు ఆగటం లేదు. రోజుల వ్యవధిలోనే బాంబు పేలుళ్లకు పాల్పడుతూ వందల మంది ప్రాణాలను బలి తీసుకుంటూ ఆయా దేశాలకు సవాల్ విసురుతున్నారు. డాకా నరమేధం మరువక ముందే శనివారం రాత్రి ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో ఐఎస్ ఉగ్రవాదులు వరుస పేలుళ్లు జరిపి సుమారు 172 మందిని బలి తీసుకున్నారు. బాగ్దాద్ లో అత్యంత జన సమ్మర్ధం గల కర్రాదా వాణిజ్య ప్రాంతంలో శనివారం రాత్రి ప్రజలంతా రంజాన్ షాపింగ్ లో ఉండగా అక్కడికి ట్రాక్ లో వచ్చిన సూసైడ్ బాంబర్ తనని తాను పేల్చేసుకున్నాడు.

ట్రక్కులో భారీగా పేలుడు పదార్థాలు ఉండటంతో భీకర విస్ఫోటనం సంభవించి అక్కడున్నవారిలో 172 మంది అక్కడికక్కడే మరణించారు. ఆ పేలుడు తరువాత వెంటవెంటనే మరికొన్ని బాంబు పేళ్లు జరిగాయి. మరణించిన వారిలో 15 మంది చిన్నారులు కూడా ఉన్నారు. దాడి గురించి తెలుసుకున్న ప్రధాని హైదర్ అల్ అబాబి అక్కడకు రాగా జనాలు ఆయన పై చెప్పులతో దాడి చేశారు. మరో వైపు ప్రభుత్వ అధికారులు బాగ్దాద్ రక్షణ తమ వల్ల కాదని చేతులెత్తేస్తున్నారు.