సుబ్బారావు మృతి పట్ల బాలకృష్ణ సంతాపం

Friday, April 16th, 2021, 04:12:33 PM IST

ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు మృతి పట్ల ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మేరకు హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. కాకర్ల సుబ్బారావు కుటుంబానికి నందమూరి బాలకృష్ణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు నేల ఒక గొప్ప వైద్య దిగ్గజాన్ని కోల్పోయింది అని వ్యాఖ్యానించారు. ఆయన మరణం వైద్య వృత్తికి తీరును లోటు అని బాలకృష్ణ తెలిపారు. ఎంతోమంది వైద్యులను తీర్చిదిద్దిన మహానుభావుడు ఆయన అంటూ చెప్పుకొచ్చారు. అయితే హైదరాబాద్ నిమ్స్ లో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలకు ఆయన ఎంతో కృషి చేశారు అని తెలిపారు.