కొత్తరాజదానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలి : బాలకృష్ణ

Thursday, December 18th, 2014, 04:08:30 PM IST


తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పాటుబడిన నందమూరి తారక రామారావు పేరును ఆంధ్రప్రదేశ్ రాజధానికి పెట్టాలని హిందూపురం ఎమ్మెల్యే… సినీనటుడు బాలకృష్ణ అన్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడారు. గతంలో అనంతపురం జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని చెప్పారని అన్నారు. కొత్తరాజధానికి ఎన్టీఆర్ పేరును పెడితే… అనంతపురం జిల్లాపేరును ఉపసంహరించుకుంటామని బాలకృష్ణ చెప్పారు. ఒకవేళ రాజధానికి ఎన్టీఆర్ పేరును పెట్టని పక్షంలో జిల్లాల పునర్విభజన తరువాత ఏర్పడే హిందూపురం జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని బాలకృష్ణ సూచించారు. తన నియోజక వర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతామని బాలకృష్ణ ఈ సందర్భంగా తెలియజేశారు.