బాలకృష్ణ తో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్న మాస్ డైరెక్టర్!

Wednesday, February 24th, 2021, 04:26:46 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బీ బీ 3 చిత్రం లో నటిస్తున్నారు. అయితే బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పింది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ రోర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే ఈ సినిమా అనంతరం చేసే సినిమా పట్ల బాలకృష్ణ మరింత శ్రద్ద వహిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల రవితేజ తో కలిసి క్రాక్ మూవీ తో సాలిడ్ హిట్ కొట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని బాలకృష్ణ తో పాన్ ఇండియా మూవీ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సినీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. అయితే బాలకృష్ణ గోపీచంద్ మలినేని కలిసి దిగిన ఫోటో తోనే నెక్స్ట్ బాలయ్యతో అంటూ హింట్ ఇచ్చేశాడు దర్శకుడు. అయితే ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బాలయ్య బోయపాటి దర్శకత్వంలో ప్రస్తుతం నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం గోపీచంద్ తో పని చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.