బాలయ్య వందో చిత్రంలో గోన గన్నారెడ్డి పాత్ర..?

Wednesday, February 3rd, 2016, 11:01:56 AM IST


బాలకృష్ణ 99 చిత్రాలు పూర్తిచేశారు. త్వరలోనే తన వందో చిత్రం ఉండబోతున్నది. అయితే, వందో సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటివరకు ముగ్గురు నలుగురు దర్శకులను అనుకుంటున్నారు. మొదటగా తనకు సింహా, లెజెండ్ వంటి హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీనును, తరువాత పరుచూరి రవీంద్రను, సింగీతం శ్రీనివాసరావును, అనిల్ రావిపూడిని ఇలా అనేకపేర్లు అనుకున్నారు. అయితే, ఇంతవరకు ఎవరు కూడా ఫైనలైజ్ కాలేదు.

ఇక ఇదిలా ఉంటే, సింగీతం శ్రీనివాసరావు బాలయ్య వందో చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నరనే వార్తలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. సింగీతం దర్శకత్వంలో 1991లో వచ్చిన ఆదిత్య 369 కి కొనసాగింపుగా బాలయ్య వందో చిత్రం ఆదిత్య 999 ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆదిత్య 369 లో టైం మిషన్ రాయల కాలానికి వెళ్తే.. ఆదిత్య 999 లో టైం మిషన్ కాకతీయుల కాలానికి వెళ్తుందట. ఇక.. బాలకృష్ణ కాయతీయుల కాలంలో పేరు పొందిన గోన గన్నారెడ్డిగా కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది త్వరలోనే తెలుస్తున్నది.