పంచ్ డైలాగ్స్ తో బాలయ్య అదరగొట్టాడు..!!

Monday, December 21st, 2015, 10:49:01 AM IST


అమరావతిలో బాలకృష్ణ 99 వ చిత్రం డిక్టేటర్ ఆడియో వేడుక ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సిని ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఆడియో వేడుకలో బాలయ్య సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఈ సినిమా ఆడియో విడుదల సమయంలో బాలకృష్ణ కొన్ని పంచ్ డైలాగులు విసిరారు. ఈ డైలాగ్స్ తో అభిమానులు తడిసిముద్దయ్యారు. డైలాగ్స్ వింటుంటే.. సినిమా తప్పకుండా విజయం సాదిస్తుందని బాలయ్య అభిమానులు చెప్తున్నారు. ఇక, బాలకృష్ణ అసలు ఏం డైలాగ్స్ చెప్పాడో ఇప్పుడు చూద్దాం.

దాహం వేస్తె సింహం కూడా దించుకొనే నీళ్ళు తాగుతుంది. అంత మాత్రాన.. తలదించుకుంది అని తొడగొట్టకు. కొట్టడానికి తొడ.. ఎత్తడానికి తల రెండు ఉండవు. పర్వతం ఎక్కు పర్వాలేదు.. కాని పర్వతాన్ని ఎత్తాలని చూస్తే.. పైకి పోతావ్..!! నాపేరు ధర్మ.. నా ఒంట్లో ఉన్న అహం పేరు డిక్టేటర్.. ఇటువంటి డైలాగ్స్ తో బాలయ్య అమరావతిలో జరిగిన ఆడియో వేడుకలో అలరించారు. బాలకృష్ణ సినిమా అంటేనే భారీ డైలాగ్స్ ఉంటాయి. సింహ, లెజెండ్ తరహాలోనే డిక్టేటర్ కూడా మంచి మాస్ హిట్ సినిమా అవుతుందని అభిమానులు చెప్తున్నారు.