బాలయ్య 100 చిత్రం భారీగా ప్రారంభం..!

Friday, April 8th, 2016, 11:25:08 AM IST


నందమూరి బాలకృష్ణ వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి ఉగాది సందర్భంగా ఈరోజు అమరావతి నగరంలో ప్రారంభమయింది. ఉగాది పర్వదినం సందర్భంగా అమరావతి నగరంలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను వెలువరించారు. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.

ఇక అమరావతి నగరాన్ని పరిపాలించిన గౌతమి పుత్ర శాతకర్ణి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా వస్తున్నది. ఇక ఏప్రిల్ 22 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. యుద్ధ సన్నివేశాలను మొరాకో దేశంలో చిత్రీకరిస్తారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేసి సినిమాను సంక్రాంతికి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.